My Daily Strength

రెవ. డాక్టర్. జె. శామ్యేల్ సుధాకర్.

ఒక నిశ్శబ్దమైన ప్రశాంతమైన రాత్రి, భారముతో నిండియున్న ఒక ఆత్మ, " నీ దాసుడు ఆలకించుచున్నాడు ఆజ్ఞయిమ్ము... చిత్తగించుము నేనున్నాను నన్ను పంపుము.... '' (1 సమూయేలు 3:4,10; యెషయా 6:8)అని మొఱ్ఱపెట్టినది. ఒక వ్యక్తి తన జీవితములో అతని ఆశలు, కలలు, ఇహలోకపు పరధ్యానములన్నిటిని విడిచిపెట్టి దేవుని సేవించుటకు నిర్ణయము తీసుకొనే సమయము అప్పుడు ఆసన్నమైనది.

1982 వ సంవత్సరం, ఏప్రిల్ 2వ తేదీన రెవ. డాక్టర్. జాన్ జోసప్గారు (ఇజిటజీట్ట జౌట ఉఠ్ఛిటడ ఖిౌఠజూ కజీnజీట్టటజ్ఛీట) స్థాపకులు నిర్వహించిన ఆరాధన కూటములో దేవుని సేవ చేయుటకు రెవ. డా. శామ్యేల్ సుధాకర్‌గారు దేవుని పిలుపును పొందుకొన్నారు. ఆయన ఆ సమయములో అప్పుడే డిగ్రీ పరీక్షలు వ్రాసిన ఒక Äౌవనస్థుడైయున్నాడు. ఆ రోజు ఆయన పరిపూర్ణ మారుమనస్సును పొందారు. రెవ. డాక్టర్. జాన్ జోసప్గారు, వారి గతాన్ని, వాస్తవమును మరియు భవిష్యత్తును గూర్చి వెల్లడి చేసినప్పుడు, శామ్యేల్ సుధాకర్‌గారు మన:పూర్వకముగా మరియు పూర్ణ హృదయముతో దేవునికి తనను తాను సమర్పించుకొన్నారు.

దేవుని నుండి వచ్చిన ఆ మాటలు శామ్యేల్ సుధాకర్‌గారి హృదయములో లోతుగా అల్లుకొనిపోయినవి మరియు " అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసియున్నది '' (ప్రకటన 2:4) అను వచనము, ఆయన జీవితమును పూర్తిగా మార్చివేసినది. వెంటనే ఆయన మోకరించి, " సిలువ నా యెదుట నుండును గాక మరియు లోకము నా వెనుకకు పోవును గాక. నీ చిత్తము నా జీవితములో నెరవేరును గాక. ప్రభువా, నీ చిత్తమే నా ఆనందం '' అని ప్రార్థించారు. ఆయన యొక్క పిలుపులోని ఒక ముఖ్యమైన క్షణాలను వివరించుచున్నప్పుడు ఆయన ఈ విధంగా చెప్పారు, " దేవుని ప్రేమ నా హృదయాంతరంగములలోనికి చొచ్చుకొనిపోయినది. మరియు నేను ఆయన పాదముల చెంత విధేయతతో నన్ను నేను సమర్పించుకొనుట తప్ప నాకు వేరే ఎంపిక లేదు. అద్భుతమైన కృప! ఆయన మధురమైన స్వరము నా వంటి ఒక దౌర్భాగ్యుడను రక్షించినది. తప్పిపోయిన నన్ను కనుగొన్నాడు. గుడ్డివాడనైయున్న నేను ఇప్పుడు చూడగలుగుచున్నాను. '' ఇంకను ఆయన యొక్క మారుమనస్సును గూర్చి, " నేడు నేను ప్రాణాలతో మీ యెదుట నిలబడి, దేవుని సందేశమును అందించుచున్నాను అనగా, అది కేవలం దేవుని కృప మాత్రమే, నేను జీవించుచున్న జీవితము నాది కాదు, పాపపు ఊబిలో నుండియు మరియు అపవాది బంధకముల నుండియు నన్ను రక్షించిన నా రక్షకుడైన యేసుక్రీస్తుకు సొంతమైయున్నది '' అని చెప్పియున్నారు. శామ్యేల్ సుధాకర్‌గారి జీవితము మరియు ఆత్మకును ప్రభువైన యేసుక్రీస్తు కేంద్రభాగమైయున్నాడు అనుటలో ఎటువంటి సందేహము లేదు.

1960వ సంవత్సరము మే 9వ తేదీన, ఒక మధ్య తరగతి కుటుంబములో జన్మించిన శామ్యేల్ సుధాకర్‌గారు, చిన్నతనంలో ఎంతో కీలకమైన మరియు సంతోషకరమైన జీవితమును జీవించారు. వారి చిన్నతనమును వెనక్కు తిరిగి చూసినట్లయితే, క్రీస్తు ఆయనను ప్రత్యేకముగా గుర్తించినట్లు కనబడుతుంది. రెండు సందర్భములలో దేవుని కృప మరియు కాపుదల ఆయనను రక్షించినది. మొదటిసారిగా, చిన్న పిల్లలుగా ఉన్న శామ్యేల్ మరియు ఆయన సహోదరి. డెంగ్యూ జ్వరంతో బాధపడుచున్నప్పుడు, రెండు సంవత్సరముల వయస్సుగల శామ్యేల్ మరణము నుండి కాపాడబడెను గానీ, ఆయన చెల్లెలు వ్యాధి భారినపడి మరణించినది. రెండవసారి ఆయన 1వ తరగతి చదువుచున్నప్పుడు, ఇంటికి వెళ్లుటకు దారి తప్పిపోయారు. ఆ సమయములో దేవుని దూత ఒక అపరిచితుడి రూపంలో వచ్చి, బాలుడైన శామ్యేల్గారికి దారి చూపించి, దుఃఖములో ఉన్న తల్లిదండ్రులకు అప్పగించాడు.

దక్షిణ భారత దేశములోని చెన్నై పట్టణములో నున్న ట్రిప్లికేన్ అను ప్రాంతములోని ఒక చర్చిలో ఆయన ఒక సండేస్కూల్ టీచర్‌గాను మరియు యూత్ లీడర్‌గాను సేవ చేశారు. ఆయన బైబిల్ క్విజ్ మరియు పాటల పోటీలలో పాల్గొని వారి సంఘమునకు అనేక బహుమతులను సాధించారు. 1979వ సంవత్సరములో, తాంబరం అను ప్రాంతములోని ప్రఖ్యాత మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో మొదటి సంవత్సరం చదువుచున్నప్పుడు, ఆ కాలేజీలో క్రొత్తగా ప్రారంభించబడిన ప్రేయర్సెల్ నాయకులలో ఆయన కూడ ఒకడైయున్నాడు. కాలేజీలో డిగ్రీ చదువుచున్న మూడు సంవత్సరములు ఆయన ఈ ప్రేయర్ సెల్లో క్రమంగా పాల్గొనేవారు. మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన వెంటనే, దేవుడు ఆయనను ఒక ప్రత్యేకమైన ఉద్దేశముతో ఏర్పరచబడినట్లుగా గుర్తించి, రెవ. డాక్టర్. జాన్ జోసఫ్గారి పరిచర్యలో సహకరించుటకు ప్రారంభించారు.

పాత నిబంధన గ్రంథములో హన్నా తన కుమారుడైన సమూయేలును దేవుని మందిరములో సేవ చేయుటకు అర్పించిన ప్రకారం శామ్యేల్ సుధాకర్ తల్లిదండ్రులు కూడ సంతోషముగా తమ కుమారుడిని దేవుని సేవకు అర్పించారు. శామ్యేల్ సుధాకర్‌గారు, కేవలం ఒక జత బట్టలతో వారి తల్లిదండ్రులను మరియు ఇంటిని విడిచిపెట్టి, " మనుష్యులందరు నా వశములో నున్నాను '' (యెహెజ్కేలు 18:4) అను వచనము ద్వారా ప్రేరేపించబడి, " Christ for Every Soul Ministries'' అనుపేరుతో నూతన పరిచర్యను ప్రారంభించిన, ఆయన గురువు మరియు మార్గదర్శియైన, రెవ. డాక్టర్. జాన్ జోసఫ్గారిని అనుసరించారు. " Christ for Every Soul Ministries'' అను విశ్వాస పరిచర్య నిలబడుటకు కారణం, అది కేవలం దేవుని మీద మాత్రమే ఆధారపడియున్నది.

ఇకపై ఆయన ఇతర యౌవనస్థుల వలె స్నేహితులతోను మరియు కుటుంబముతోను ఆనందముగా గడుపుటకు సాధ్యపడదని అర్థం. ఆయన దేవుని కొరకు సమస్తమును విడిచిపెట్టి రావలెననునదే ఆయనకు దేవుడిచ్చిన పిలుపు. గతంలో శామ్యేల్ సుధాకర్‌గారు అందించిన సందేశములో, ఆయన, " దేవుని పిలుపు వచ్చిన తరువాత, మరియు నేను పరిశుద్ధాత్మతో నింపబడిన తరువాత, నాకు సమస్తము ఆయనే అనుకొనిన అతడు నాకెంతో ప్రియమైన స్నేహితుడు, నాకు ఏమీ కాకుండెను '' అని చెప్పారు. ఒక వ్యక్తి తన జీవిత మార్గమును అనుసరించినట్లయితే, ఆ తరువాత అతని జీవితము అద్భుతమైన దేవుని శక్తి ప్రేమ, కృప మరియు కనికరమునకు ఉన్నతమైన సాక్ష ్యముగా నిలుచును.

ఈ పరిచర్య యొక్క మొదటి కన్వెన్షన్, 1982వ సంవత్సరము, జూలై 2వ తేదీన దక్షిణ భారత దేశములోని చెన్నై పట్టణములో నున్న నర్సన్ అసోసియేషన్ హాల్ నందు నిర్వహించబడినది. ఆత్మలను రక్షించు ఈ గొప్ప పరిచర్య నిమిత్తము, Äౌవనస్థుడైన శామ్యేల్ సుధాకర్ మరియు అతని ప్రియ సహోదరుడు రెవ.డాక్టర్. జాన్ జోసఫ్గారు మూడు దినములు ఉపవాసముతో సిద్ధపడ్డారు. వారి యొక్క ఆత్మీయ పరిశోధన మరియు ముందంజు వేయుటకు సిద్ధపాటు కలిగియుండుట ద్వారా ఈ కూటము విజయవంతమగుటకు కారణమయ్యింది. ఆ తరువాత అనేక కూటములు నిర్వహించబడినవి. మరియు రెవ. డాక్టర్. జాన్ జోసఫ్గారు మరియు శామ్యేల్ సుధాకర్‌గారు, దేవుని ఆత్మతో నింపబడిన ఈ పరిచర్యలో సుదీర్ఘమైన కాలం కలిసి సేవ చేశారు.

1982 నుండి 2007 మధ్య కాలంలో, రెవ. డాక్టర్. జాన్ జోసఫ్గారు పరిచర్యలోని వివిధ కార్యక్రమములను ఏవిధంగా నిర్వహించాలనే విషయములలో శామ్యేల్ సుధాకర్‌గారికి శిక్షణ ఇచ్చారు. పరిచర్య యొక్క ఆర్థిక శాఖను ఈయన చూసుకొనేవారు. అంతేగాక, ఆయన పరిచర్యకు సంబంధించిన “The Voice of Restoration" అను పేరుగల మాస పత్రికను తీర్చిదిద్దుటకు డాక్టర్. జాన్ జోసఫ్గారికి సహాయము చేస్తుండేవారు. మరియు శామ్యేల్ సుధాకర్‌గారు, రెవ. డాక్టర్. జాన్ జోసఫ్గారికి సెకరెట్రీగా పనిచేయుచు, ఆయన యొక్క పరిచర్య కార్యక్రమములను పర్యవేక్షించుట, పర్సనల్ అపాయింట్మెంట్లు మరియు ఉత్తర ప్రత్యుత్తరాలు వంటి పనులన్నిటిని చూసుకొనేవారు. 1988 వ సంవత్సరము నుండి డాక్టర్. జాన్ జోసఫ్గారికి ప్రతి శుక్రవారం నిర్వహించబడు ప్రార్థన కూటములను నిర్వహించే బాధ్యతను ఆయన యొక్క దాసుడైన శామ్యేల్ సుధాకర్‌గారికి అప్పగించారు. అంతేగాక, డాక్టర్. జాన్ జోసఫ్గారు ఇతర కూటముల నిమిత్తము విదేశములకు వెళ్లినప్పుడు, మంగళవారము కూటములను కూడ శామ్యేల్ సుధాకర్‌గారు క్రమంగా నిర్వహించేవారు.

2007, జూలై 18వ తేదీన ఆకస్మాత్తుగా, రెవ. డాక్టర్. జాన్ జోసఫ్గారు దేవుని యొద్దకు పిలుచుకొనబడ్డారు. అప్పటి వరకు ప్రకాశవంతముగా వెలుగుచున్న కొవ్వొత్తి ఆరిపోయింది. అయినను, పరిచర్య మీద దేవుని కాపుదల నిలిచియున్నది. 1982 వ సంవత్సరములోనే డాక్టర్. జాన్ జోసఫ్గారికి శామ్యేల్ సుధాకర్గారిని దేవుని సేవకునిగా ప్రతిష్ఠించారు. గనుక ఏలీయా దుప్పటి ఎలీషా మీద పడినట్లుగా, ఈ పరిచర్య భారం సమర్థుడైన శామ్యేల్ సుధాకర్‌గారి భుజముల మీద పడినది.

మానసిక పరిస్థితి చాలా విచారముగా ఉన్నది మరియు అందరు రెవ. డాక్టర్. జాన్ జోసఫ్గారి మరణమును తలంచి రోదించుచున్నారు, కానీ, దేవుడు అనేక సంవత్సరముల క్రితం ప్రారంభించిన చిత్తమును పూర్తి చేయుచున్నాడు. రెవ. డాక్టర్. జాన్ జోసఫ్గారు దేవుని వద్దకు వెళ్లిపోయిన ఒక నెల రోజుల తరువాత, ఉద్దేశ పూర్వకముగా అమెరికా సంయుక్త రాష్ట్రముల నుండి రిటైర్డ్ రెవ. డాక్టర్. జార్జిగారు వచ్చి, శామ్యేల్ సుధాకర్గారిని రెవరెండ్గా నియమించారు.

నేడు రెవ.డాక్టర్. శామ్యేల్ సుధాకర్‌గారు పరిచర్యలో ఎంతో ఉన్నత స్థానమునకు ఎదిగారు. ఆయన ఇవాంజెలిసం డివినిటీ మరియు మినిస్ట్రీ అను అంశములలో డాక్టరేట్లు కలిగియున్నారు. దేవుని మహా కృపా మరియు కనిరకముల ద్వారా, 2010 వ సంవత్సరం మే నెలలో ఆయన యం.బి ఎ. డిగ్రీలలో హ్యూమన్ రిసోర్సన్ విభాగంలో మొదటి తరగతిలో ఉత్తీర్ణత పొందారు. ఆయన ఈ డిగ్రీలన్నిటిని దేవుని పాదముల యొద్ద సమర్పించి, అపొస్తలుడైన పౌలు మాటలలో, ".... నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతిశ్రేష్ఠమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని, ధర్మశాస్త్రమూలమైన నా నీతినిగాక, క్రీస్తునందలి విశ్వాసమువలననైన నీతి, అనగా విశ్వాసమునుబట్టి దేవుడు అనుగ్రహించు నీతిగలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తమును.... '' (ఫిలిప్పీయులకు 3:8,9) అని చెప్పుచున్నారు. రెవ. డాక్టర్. జాన్ జోసఫ్గారు గొప్ప వారసత్వమును వదలి వెళ్లారు. మరియు దానికి రెవ. డాక్టర్ శామ్యేల్ సుధాకర్‌గారు నిజంగా పాత్రుడైయున్నారు. రెవ. డాక్టర్. జాన్ జోసఫ్గారి మీద నున్న అభిషేకును, పరిశుద్ధాత్మ శక్తిని మరియు ఎంతో వాంఛతోను ప్రవచనాత్మ దర్శనముతోను దేవుని వాక్యమును అందించే వరమును, శామ్యేల్ సుధాకర్‌గారు ఆరంభమునుండే ఆయన యొద్ద నుండి వారసత్వముగా పొందుకొన్నారు. 2008 జనవరి 1వ తేదీన శామ్యేల్ సుధాకర్‌గారి ద్వారా దేవుడు బయలుపరచిన ప్రవచనములను మరియు ఆయన ద్వారా దేవుడు ప్రత్యక్షపరచిన కార్యములను, ప్రభువు ఆ సంవత్సరాంతములోనే నెరవేర్చియున్నాడు.

రెవ. డాక్టర్. జాన్ జోసఫ్గారి నడిపింపు మరియు నాయకత్వంలో సంపాదించిన విస్త ృతమైన ఆధ్యాత్మిక శిక్షణ మరియు గొప్ప అనుభవము, పరిచర్యలో వివిధ అంశాలను ప్రారంభించుటకు మరియు ముఖ్యము సాహిత్య పరిచర్యలను ప్రారంభించుటకు సహాయపడినవి. 2007, అక్టోబర్ నెల ఆరంభంలో పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం ఆంగ్లంలోను మరియు ప్రాంతీయ భాషయైన తమిళంలోను " నా అనుదిన బలము '' "My Daily Strength" అను పేరుతో అనుదిన ధ్యాన పుసక్తము ప్రచురించబడినది. కానీ, " నా తలంపులు మీ తలంపుల వంటివి కావు ... '' (యెషయా 58:8)అను వచనము ప్రకారము, 2008వ సంవత్సరమంతటికిని వార్షిక సంచికను ప్రచురించుటకు ప్రభువు కృపను అనుగ్రహించాడు. మరియు దేవుని ఆశీర్వాదము కొనసాగుతూనే ఉంది. ఎందుకనగా, అది ఆయన చిత్తమైయున్నది. 2012వ సంవత్సరములో ప్రచురించబడిన సంచిక వరుస క్రమంలో 5వ సంచిక, ఇది ఐదు భాషలలో (ఆంగ్లం, తమిళం, తెలుగు, హిందీ మరియు మలయాళం)లో ప్రచురించబడిబడినది. ఆయన "Christ for Every Soul" అను సంఘమునకు ధర్మకర్తయైయుండుట మాత్రమే గాక, చెన్నై పట్టణమునకు మైలురాయియైన 'ఇ్ఛn్టఠటజ్ఛీట ౖజూఛీ ఇజిటజీట్ట ఇజిఠటఛిజి' లో ప్రధాన యాజకుడైయున్నారు. అంతేగాక ఆయన, "Christ Church Anglo Indian Higher Secondary School" కరెస్పాండెంట్‌గా గౌరవ పదవిలో ఉన్నారు. అంతేగాక, ఆయన మద్రాసు Y.M.C.A లోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో ఒకరైయున్నారు. మరియు Y.M.C.A. కాలేజీలోని అనేక కార్యక్రమములకు చైర్మన్‌గా వ్యవహరించుచున్నారు. ఆయన యొక్క నైపుణ్యత, తమిళనాడు రాష్ఠ్రములోని అనేకులకు మాత్రమేగాక, ప్రపంచములోని అనేక భాగములలో ఆశీర్వాదకరముగా ఉన్నది. డాక్టర్. శామ్యేల్ సుధాకర్‌గారు అమెరికా సంయుక్త రాష్ట్రములలోని వివిధ ప్రాంతములకు, మలేషియా, ఆస్ట్రేలియా, శ్రీలంక మరియు ఇండోనేషియా వంటి అనేక దేశములకు ప్రయాణించారు.

"Christ for Every Soul" పరిచర్య " నూతన మలుపు తీసుకొనును '' అని డాక్టర్. జాన్ జోసఫ్గారు ప్రవచించిన ప్రవచనము నెరవేరినది. ఇది డాక్టర్. శామ్యేల్ సుధాకర్‌గారి ఫలభరితమైన, పరిశుద్ధమైన మరియు ప్రవచనాత్మకమైన పరిచర్యలో గుర్తించబడినది. దేవుడు ఆయనను అత్యధికముగా ఆశీర్వదించాడు. దేవుని కృప వలన ప్రారంభించబడిన, శుక్రవారపు బైబిల్ తరగతులు, స్వస్థత కూటములు, ప్రతి నెల ఉపవాస ప్రార్థనలు మరియు ప్రతి నెల రాత్రి ప్రార్థనలు వంటి నూతన పరిచర్య ద్వారా రక్షణ సందేశము అనేకులకు అందించబడుచున్నది. రెవ. డాక్టర్. శామ్యేల్ సుధాకర్‌గారు అనేక ఛానళ్లలోని ఆధ్యాత్మిక టి.వి. కార్యక్రమములను పునరుద్ధరించి, లక్షలాది మంది జ్రపల జీవితములో సంతోషమును, నమ్మకమును మరియు ఆదరణనను తీసుకొని వచ్చుచున్నారు.

రెవ. డాక్టర్. శామ్యేల్ సుధాకర్‌గారు తన సహోదరుడైన డాక్టర. జాన్ జోసఫ్గారి లక్ష్యమును నెరవేర్చాలని ఆశించుచున్నారు. భారముతోను నిరాశనతోను ఉన్న ప్రజలు, ఉపశమును మరియు స్వస్థతను పొందుకొనుటకు ఒక ప్రార్థన కేంద్రమును ప్రారంభించవలెనని ఆయన అనుకొనుచున్నారు. పది సంవత్సరముల వయస్సుపైగా ఉన్న పిల్లలకు శిక్షణ ఇచ్చుట ద్వారా వారిని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సైనికులనుగా మార్చవలెనని ఆశించుచున్నారు. మరియు చూసుకొనుటకు ఎవరనలేక, దీన స్థితిలో నున్న వృద్ధులైన దైవ సేవకులకు ఒక ఆశ్రమమును స్థాపించవలెనని, ఆయన తమ దర్శనమును పంచుకొన్నారు. ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానము ద్వారా దేవుని వాక్యమును ప్రచురించి, క్రీస్తు కొరకు అనేకులను రక్షించవలెనని ఆయన ఆశించుచున్నారు. దేవుని శక్తి మానవుల బలహీనతలను మరియు బాధలను విజయవంతముగా మార్చుననే లోతైన విశ్వాసము, ఈ లక్ష్యాలను నెరవేర్చుటకు ఆయనను బలపరచుచ్నుది. " దేవుడే సమస్తమును సఫలము చేయును '' అనే విశ్వాసముతో ఆయన కొనసాగుచున్నారు.

అనేక సందేశములలో, " నాలో ఎన్నడు ఇహలోకపు ఆశలు, ధనాశ, ఈలోకములోని గర్వం కలుగకూడదు, కానీ, నేనెల్లప్పుడు దేవుని చిత్తమును మాత్రమే చేయవలెను '' అని ఆయన తనకు ఇష్టమైన ప్రార్థన చేయుటను చూచినప్పుడు, దేవుని సేవలో ఆయనకు కలిగియున్న స్థిరమైన ఉద్దేశమును ప్రత్యక్షపరచుచున్నది.అపొస్తలుల కార్యములు 20:4 వ వచనమును సూచించుచు, డాక్టర్. శామ్యేల్ సుధాకర్‌గారు, జీవిత కాలమంతయు తన యజమానునికి అంకిత భావముతో సేవ చేయుదునని దృఢముగా చెప్పుచున్నారు. " అయితే, దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష ్యమిచ్చుట యందు నా పరుగును, నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను, తుదముట్టింపవలెనని నా ప్రాణమును నాకెంతమాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనుట లేదు '' అని తెలియజేశారు.